Vijay- Anand | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 31న గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదలైన ‘అన్న అంటేనే..’ పాట సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ పాట అన్నదమ్ముల అనుబంధాన్ని సెంటిమెంటల్ టచ్‌తో మిళితం చేస్తూ రూపొందించబడింది. పాట విడుదలైన వెంటనే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఈ పాటతో భావోద్వేగానికి లోనయ్యారు.
తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆనంద్ దేవరకొండ, “నేను ఏదైనా సాధించగలను అని నా కన్నా ముందే నమ్మిన వ్యక్తి మా అన్నయ్య. ఈ పాట వినగానే నాకు గూస్బంప్స్ వచ్చాయి. చిన్నప్పటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి లోనయ్యాను.” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ్ముడు-అన్నయ్య మధ్య బంధాన్ని చూపించే చిన్ననాటి ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వీడియోకి నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కింగ్డమ్ విషయానికి వస్తే.. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
విజయ్ దేవరకొండ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే సినిమాగా ఈ చిత్రం మారుతుంది. ‘అన్న అంటేనే..’ పాటకు వచ్చిన స్పందన చూస్తుంటే, ఈ చిత్రానికి సంగీతం ప్రధాన హైలైట్‌గా నిలవనుందని అర్థమవుతోంది. స్నేహ బంధం, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ , థ్రిల్ వంటి అంశాలతో ‘కింగ్డమ్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండకి ఈ చిత్రం మంచి విజయం అందించాలని సినీ ప్రియులు కూడా కోరుకుంటున్నారు.