Hari Hara Veera Mallu | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్. పీరియడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ వైరల్‌గా మారింది. పవన్ అభిమానుల కోసం ఒకరోజు ముందుగానే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌ని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విడుదల రోజు ముందు బుధవారం రాత్రి 9.30 గంటలకు ఈ పెయిడ్ ప్రీమియర్ షోలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్, నాజర్, నార్గిస్ ఫఖ్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని ఎ. దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.