Nayan Sarika | నార్నే నితిన్ (Nithin), నయన్ సారిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఆయ్’ (Aay). అంజి కె మణిపుత్ర దర్శకత్వం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా గోదావరి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. ఆగస్ట్ 15న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.ఈ చిత్రంలో నయన్ సారిక నటనకు ఇంప్రెస్ అవుతున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో తన సంతోసాన్ని అందరితో షేర్ చేసుకుంది నయన్ సారిక.
నా పాత్రను చాలా అవలీలగా నడిపించానని జూనియర్ ఎన్టీఆర్ సార్ అన్నారు. ఇక సినిమా చూసిన తర్వాత నేను సౌతిండియన్ను కాదని తెలిసి షాకైనట్టు అల్లు అర్జున్ చెప్పారు. నా కండ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నాయని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి పెద్ద స్టార్ల నుంచి నాకు ప్రశంసలు దక్కడం గొప్ప గుర్తింపుగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మరువలేనివి.
టాలీవుడ్లో ఉత్తమ ప్రారంభం కోసం అడగలేదు. అందరి సమిష్టి కృషి ఫలితమే ఈ విజయం. వ్యక్తిగతంగా నాకిది చాలా గొప్ప విషయం. ఈ సినిమాలో అవకాశమిచ్చిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బృందానికి, డైరెక్టర్ అంజి సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చింది నయన్ సారిక.
డిగ్రీ చదువుతుండగానే నటిగా అవకాశం అందుకున్న సారిక.. హీరోయిన్గా మెప్పించాలనుకున్న తన కల నెలవేర్చుకోవాలని ఓ వైపు ఆయ్ షూటింగ్లో పాల్గొంటూనే.. మరోవైపు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అయింది. క్యారవాన్‌లో షూటింగ్ గ్యాప్‌లో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేదాన్ని అని చెప్పుకొచ్చింది నయన్ సారిక.
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్‌కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్, మిమే గోపి ఇతర కీలక పాత్రల్లో నటించారు. అజయ్ అరసాడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రామ్ మిర్యాల బాణీలు సమకూర్చాడు.
Devara | తారక్-జాన్వీకపూర్ మాస్ డ్యుయెట్.. దేవర థర్డ్ సాంగ్ ఇదే
Kanguva | ఆ వార్తలే నిజమయ్యాయి.. కంగువ వాయిదాపై సూర్య క్లారిటీ
Indian 2 | ఇండియన్ 2 టీంకు షాక్.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీసులు..!