Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా పుష్ప స్పెషల్ ప్రీమియర్స్‌కు సంబంధించిన వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఒక్క రోజు (డిసెంబర్ 5న) ముందే పుష్ప 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రీమియర్స్ ఉండబోతున్నాయట. అంతేకాదు ముంబైలో తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు గ్రాండ్ షో వేయబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఇక విడుదల రోజు వేకువ జామునే 1 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తోంది. ఇక ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో క్యూరియాసిటీ అమాంతం పెరిగిపోతుంది.
సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!