Allu Arjun | ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన విలక్షణ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) లీడ్ యాక్టర్‌గా తనలోని మరో యాంగిల్‌ను చూపించబోతున్నాడనే విషయం తెలిసిందే. రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం (Maruti Nagar Subramanyam). హ్యాపీ వెడ్డింగ్ ఫేం లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆగస్టు 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ ఏంటది.. అనుకుంటున్నారా..? ఈవెంట్లో పుష్ప యాక్టర్, డైరెక్టర్ సందడి చేయబోతున్నారన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. షూటింగ్ టైంలో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని పుకార్ల నేపథ్యంలో.. ఈ ఇద్దరూ ఒకే ఈవెంట్లో మెరువబోతున్నారన్న వార్త మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఖుషీ చేస్తోంది.
మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేయబోతున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో అలనాటి అందాల తార ఇంద్రజ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్లో వస్తున్న రెండో చిత్రమిది.
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్