Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంపౌండ్ నుంచి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాంఛైజీ సినిమా పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది సుకుమార్ టీం.
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫినిషింగ్ టచ్‌కు సంబంధించిన వార్త వచ్చేసింది. ఫైనల్‌గా పుష్ప ది రూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. పుష్ప షూటింగ్ చివరి రోజు.. చివరి షాట్. పుష్ప ఐదేళ్ల ప్రయాణం పూర్తయింది. వాట్ ఏ జర్నీ.. అంటూ షూట్ లొకేషన్ స్టిల్ షేర్ చేశాడు బన్నీ. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
మొత్తానికి సుకుమార్ అండ్ టీం పుష్పరాజ్‌తో అభిమానులకు కావాల్సిన ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఐదేళ్లపాటు ప్రయాణించడం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. మరి పుష్ప 2 ది రూల్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతుండగా.. రెండోసారి పుష్ప రాజ్ ఫీవర్ ఎలా ఉండబోతుందనేది చూడాలి.
విడుదలకు ముందే పాటలు నెట్టింట మార్మోగిపోతూ సినిమాను మ్యూజికల్ హిట్ చేసేశాయనయడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్లో అల్లు అర్జున్ 16×108 అడుగుల భారీ కటౌట్‌ను రెడీ చేస్తున్నారు. ఇది ఏపీ చరిత్రలో అతిపెద్దది కావడం విశేషం.
సీక్వెల్లో కన్నడ భామ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయబోతుంది. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Sritej | యువతి ఫిర్యాదు.. పుష్ప యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు
Ram Gopal Varma | రాంగోపాల్ వర్మ ట్వీట్.. కోయంబత్తూరుకు ఏపీ పోలీసులు..!
Vetrimaaran | వెట్రిమారన్ డబుల్ ట్రీట్.. విడుదల పార్ట్ 2 ట్రైలర్, ఆడియో లాంచ్ టైం ఫిక్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా