Allu Arjun | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ పోషిస్తున్న సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాంఛైజీ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతోపాటు ఇండియావైడ్‌గా పుష్పరాజ్ మేనియా కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే మరికొన్ని గంటల్లో పుష్ప స్పెషల్ షోలు పడబోతున్న నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టీం ఐకానిక్ సంధ్య థియేటర్లలో స్పెషల్ షోకు హాజరుకాబోతుందట. బన్నీతోపాటు పలువురు చిత్రయూనిట్ మెంబర్స్ కూడా ఈ షోలో సందడి చేయబోతున్నారని నెట్టింట క్రేజీ న్యూస్ క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇదే నిజమైతే థియేటర్ వద్ద ఎలాంటి రద్దీ ఉంటుందనేది ఊహించడం కష్టమే. మరి ఈ వార్తపై మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకున్నా.. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుందని చెప్పొచ్చు. సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ
Daaku Maharaaj | బాలకృష్ణ డాకు మహారాజ్ ఫినిషింగ్ టచ్.. బాబీ టీం ఎక్జయిటింగ్ న్యూస్