Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమా అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం పుష్ప ది రూల్ క్లైమాక్స్ ను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు మేకర్స్ స్పెషల్ సాంగ్ షూట్ చేయడానికి రెడీ అవుతుండగా.. క్లైమాక్స్ షూట్‌తో అగ్రభాగం షూట్ పూర్తి కానుందట. చివరి షెడ్యూల్లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్టు ఇన్సైడ్ టాక్. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత సాంగ్ షూట్‌పై నిర్ణయం తీసుకోబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఈ మూవీని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ అప్డేట్ పోస్టర్లో బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్
They Call Him OG | ఓజీ టీం బ్యాక్ ఆన్ మిషన్.. ట్రెండింగ్‌లో సుజిత్, పవన్ కల్యాణ్ స్టిల్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని