Allu arjun in pushpa | చూస్తుండగానే పుష్ప సినిమా విడుదల తేది దగ్గరకి వచ్చేసింది. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. కేవలం సమంత పాట చిత్రీకరణ మాత్రమే మిగిలిపోయింది. రెండు రోజుల కింద ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. మరో రెండు మూడు రోజుల్లో ఇది కూడా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ లోపు ప్రమోషన్ కూడా వీలైనంత ఎక్కువగా చేస్తున్నారు. దానికోసం క్రమం తప్పకుండా సినిమా నుంచి పోస్టర్స్, టీజర్ పాటలు విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈలోపు అభిమానులకు వరుసగా సర్ప్రైజ్ ఇస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఈ క్రమంలోనే తాజాగా మరో పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.
సాధారణంగానే పుష్ప సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు అల్లు అర్జున్. అందుకే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. తాజాగా మరో అదిరిపోయే పోస్టర్ విడుదల చేశారు. కట్టెలమోపు మీద లుంగీ కట్టుకొని ఉన్న అల్లు అర్జున్ ఫోటో చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి పోస్టర్లో చాలా సీరియస్‌గా ఉన్నాడు అల్లు అర్జున్. కానీ ఈసారి మాత్రం సరదాగా నవ్వుతూ ఫోటోకు కిరాక్ పోజ్ ఇచ్చాడు. విడుదలైన మరు క్షణం నుంచి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రానున్న పుష్ప బడ్జెట్ దాదాపు 120 కోట్లకు పైగానే ఉంది. ఈ సినిమా బిజినెస్ కూడా 100 కోట్ల వరకు జరుగుతుంది. అది కూడా కేవలం మొదటి భాగం మాత్రమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda : అఖండ దెబ్బకు భయపడుతున్న అమెరికా థియేటర్లు
Akhanda movie review | అఖండ ఎలా ఉన్నాడు.. కామన్ ఆడియన్స్ ఏమంటున్నారు..?
Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ
Spider Man: పుష్ప దెబ్బకు స్పైడర్ మ్యాన్ చిత్రం ఓ రోజు ముందుకెళ్లిందా?
Samantha: సమంత ఐటెం సాంగ్ మొదలు పెట్టేసింది.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే..!
Samantha: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్.. అందరు షాక్