Akhanda movie review | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే దర్శక నిర్మాతలు కూడా మాస్ పూనకాలు మొదలయ్యాయి అంటూ పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. అభిమానుల వరకు ఓకే కామన్ ఆడియన్స్‌కు అఖండ ఎలా ఉంది అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉదయం నుంచి ఎవరిని అడిగినా కూడా మాస్ కమర్షియల్ సినిమా అంటున్నారు. మరి నిజంగా అఖండ ఎలా ఉంది.. సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాలో నచ్చే అంశాలు ఉన్నాయా లేవా..?
అందరికీ నచ్చేలా బోయపాటి అఖండ సినిమా తెరకెక్కించాడా లేదంటే కేవలం అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశాడా..? దీనికి సమాధానం చెప్పడం కాస్త కష్టమైన పనే. అయినా కూడా అభిమానులకు ఎక్కువగా నచ్చేలా బాలయ్య ఇమేజ్ వాడుకుంటూ ఈ సినిమా కథ రాసుకున్నాడు బోయపాటి శ్రీను. దానికి తగ్గట్లుగానే ప్రతి సీన్ క్లైమాక్స్‌లా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ప్రతిసారి బోయపాటి సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉన్నా.. దానికి తగ్గట్లుగానే ఎమోషన్ కూడా ఉండేది. అయితే ఈ సారి అఖండలో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం ఎలివేషన్ మాత్రమే ఉంది.
మరీ ముఖ్యంగా కీలకమైన సెకండాఫ్ చాలా చోట్ల డ్రాప్ అవ్వడం.. మితిమీరిన రక్తపాతం కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమాకు దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. దీంతో కామన్ ఆడియన్స్ కాస్త పెదవి విరుస్తున్నారు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే కచ్చితంగా సింహ, లెజెండ్ కంటే అఖండ పెద్ద విజయం సాధించి ఉండేది అనేది విశ్లేషకుల మాట. వీటన్నింటినీ పక్కనపెడితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం అఖండ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంది. చాలా రోజుల తర్వాత బాలయ్య బ్యాక్ అంటూ సంబురాలు చేసుకుంటున్నారు. బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర సినిమాలు లేవు కాబట్టి కలెక్షన్ల పరంగా బాలయ్య సునామీ సృష్టించడం ఖాయం. వీకెండ్ తర్వాత కూడా ఇదే తరహాలో కలెక్షన్లు రాబడితే సింహా, లెజెండ్ సినిమాల్లా ఈ చిత్రం కూడా అఖండ విజయం సాధించడం పక్కా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
Akhanda : అఖండ దెబ్బకు భయపడుతున్న అమెరికా థియేటర్లు
Akhanda movie review | అఖండ సినిమా రివ్యూ
Akhanda : బాలయ్య అభిమానుల రచ్చ.. ఆస్ట్రేలియాలో షో రద్దు చేసిన పోలీసులు
ఏపీలో సినిమా టికెట్ రేట్లు ఎంత.. లిస్ట్ విడుదల చేసిన ప్రభుత్వం..
Akhanda benefit show | అఖండ సినిమా హైదరాబాద్ బెనిఫిట్ షో టికెట్ ధర తెలుసా..?