Allu Arjun | కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీ రంగం నుంచి నటకిరీటీ రాజేంద్రప్రసాద్, మమ్ముట్టి, దివంగత బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర, మురళీమోహన్, ఆర్ మాధవన్ పద్మ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.
కేంద్రం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలకు టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాడు. పద్మ విభూషణ్‌కు ఎంపికైన దివంగత లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర జీకి ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా. భారతీయ సినిమాకు అసమాన సేవలందించి పద్మ భూషణ్ అందుకోబోతున్న మమ్ముట్టికి శుభాకాంక్షలు.
తమ తమ రంగాల్లో అద్భుతమైన గుర్తింపు సాధించి.. నాయకత్వ లక్షణాలతో ఎంతోమందిపై ప్రభావం చూపించిన నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మకు శుభాకాంక్షలు. టాలీవుడ్లో దశాబ్ధాల సినీ ప్రయాణంలో విశేష సేవలందించిన రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ పద్మ శ్రీ పురస్కారం అందుకోనుండటం తెలుగు సినిమా గర్వించదగిన విషయమని ట్వీట్ చేశాడు.
Heartiest congratulations to all the Padma Award winners for this prestigious national honour. 🇮🇳
A special salute to #Dharmendra ji on receiving the Padma Vibhushan.
Congratulations to @mammukka garu on the Padma Bhushan, for his unparalleled contribution to Indian cinema. 🙏🏽…
— Allu Arjun (@alluarjun) January 26, 2026