Chiranjeevi | సక్సెస్ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి ఎమోషనల్ స్పీచ్… “తెలుగు సినీ ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావిపూడే”
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ పొందింది.
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఆదివారం సాయంత్రం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడిపై చిరు చేసిన ప్రశంసలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.“తెలుగు సినీ ఇండస్ట్రీకి ఫ్యూచర్ అనిల్ రావిపూడే” అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… “ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి నా గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు. అమ్మ, అన్నం ఎప్పుడూ బోర్ కొట్టనట్టే, సక్సెస్ కూడా నాకు అలాంటిదే. కాకపోతే సీనియారిటీ, మెచ్యూరిటీ కారణంగా సక్సెస్‌కు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు” అని అన్నారు. టీమ్ అంతా బయటకి వెళ్లి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంటే, నాకు అలాంటి అవకాశం లేదే అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతే వచ్చే కిక్ అంతా ఇంతా కాదు. అదే నా ఫ్యూచర్ సినిమాలకు ఫ్యూయల్‌లా పనిచేస్తుంది. అలాంటి అనుభూతులన్నీ నేను అనుభవించాను” అంటూ తన మనసు విప్పి చెప్పారు.
సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కనిపించిన వాతావరణం గురించి మాట్లాడుతూ చిరంజీవి మరింత ఎమోషనల్ అయ్యారు.ఈరోజు చూస్తుంటే ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం ఉన్న ఫీలింగ్ గుర్తొస్తోంది. అప్పట్లో ఎగ్జిబిటర్లు, బయర్లు, డిస్ట్రిబ్యూటర్లకు స్టేజ్ మీద షీల్డ్స్ ఇచ్చేవాళ్లం. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి వింటేజ్ ఫంక్షన్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. వింటేజ్ చిరంజీవినే కాదు… వింటేజ్ సెలబ్రేషన్స్‌ని కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడికే చెందుతుంది. థాంక్యూ సో మచ్ అనిల్” అని ప్రశంసల వర్షం కురిపించారు.ఆర్టిస్ట్స్‌తో అనిల్ ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్లను ఎప్పుడూ గుడ్ హ్యూమర్లో ఉంచడం చూస్తుంటే నాకు 100 శాతం కె. రాఘవేంద్ర రావు గారే గుర్తొస్తారుఅని అన్నారు.
ఇంట్లో తన పరిస్థితి గురించి సరదాగా, భావోద్వేగంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రేక్షకులను నవ్వించాయి, కదిలించాయి. మీరు షూటింగ్‌కి వెళ్తే చాలా హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటారు… షూటింగ్ త్వరగా పెట్టమని అనిల్‌కి చెప్పండి అని నా భార్య సురేఖ అంటుండేది. షూటింగ్ అయిపోయిన చివరి రోజు, పిల్లలు చదువు పూర్తయ్యాక వేర్వేరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు వచ్చే బాధను నేను అనుభవించాను” అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. “ఈ సంక్రాంతికి వచ్చిన దాదాపు అన్ని సినిమాల్నీ జనం ఆదరించారు. ఒకటి రెండు అటూ ఇటుగా ఉన్నా, మొత్తంగా ఈ సంక్రాంతి నాకు జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి” అని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

