Raghavendra Rao | మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, క్యాథరిన్ థెరిసా హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి స్పెషల్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్ర రావు, వి.వి. వినాయక్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచాయి.
రాఘవేంద్ర రావు మాట్లాడుతూ… ఇది సంక్రాంతి సినిమా. సంక్రాంతి ‘S’ లెటర్‌తో మొదలవుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత పేర్లు కూడా ‘S’తోనే స్టార్ట్ అవుతాయి. రెండు ‘S’లు కలిస్తే సూపర్ హిట్ రావడం సహజం” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి సుష్మితను చూస్తున్నానని, ఇంత పెద్ద హిట్ రావడంతో ఆమెపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. చిరంజీవితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రాఘవేంద్ర రావు భావోద్వేగంగా మాట్లాడారు. చిరంజీవి నాకన్నా చిన్నవాడు అయినా నేను అతడిని బాబాయ్ అని పిలుస్తాను. అల్లు రామలింగయ్య గారి రోజుల నుంచే మనమంతా ఒక కుటుంబంలా పెరిగాం. నా జీవితంలో నాకు గర్వకారణం ఏంటంటే… స్వర్గీయ ఎన్టీఆర్‌తో 12 సినిమాలు చేశాను, కానీ చిరంజీవితో మాత్రం 14 సినిమాలు చేయగలిగాను అని తెలిపారు.
చిరంజీవి స్టార్డమ్ గురించి మాట్లాడుతూ…జగదేక వీరుడు ఆయనే… అతిలోక సుందరి ఆయనే. హీరోయిన్ లేకపోయినా తన ఫోజులతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి చిరంజీవికి ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు.అనిల్ రావిపూడి – చిరంజీవి కలయికపై కూడా రాఘవేంద్ర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విత్తనం నాటితే ఆపిల్ చెట్టో, మర్రి చెట్టో అవుతుంది. చిరంజీవితో అనిల్ రావిపూడి సినిమా చేయాలనే ఆలోచనను నేను ఒక విత్తనం లాగా నాటాను. అది ఆపిల్ చెట్టు అవుతుందనుకుంటే, ఇప్పుడు వటవృక్షంగా మారింది. ఈ విజయానికి అనిల్ పూర్తిగా అర్హుడు అని అన్నారు.విక్టరీ వెంకటేష్ పాత్ర గురించి మాట్లాడుతూ… ఈ సినిమాలో వెంకీ గౌడగా వెంకటేష్ కన్నడలో మాట్లాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సినిమా చివర్లో ఆయన ఎంట్రీతో కథ మరింత ఊపందుకుంది. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ పోటీ పడుతూ చేసిన కామెడీనే ఈ సినిమా దుమ్ము దులపడానికి ప్రధాన కారణం” అని చెప్పారు.
చిరంజీవి వయస్సు గురించి వస్తున్న చర్చలపై స్పందిస్తూ… చిరంజీవి ఏజ్ గురించి ఎవరైనా మాట్లాడితే నవ్వొస్తుంది. అసలు ఆయనకు ఏజ్ అనే మాటే వర్తించదు. ఆయన ఎనర్జీకి, డ్యాన్స్‌కు ఇప్పటికీ ఎవ్వరూ సరిపోలేరు అంటూ చిరు రహస్యంపై సరదాగా వ్యాఖ్యానించారు. చివరగా చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్‌పై జోక్ చేస్తూ… “చిరంజీవి, వెంకీ ఇద్దరూ కలిసి చేస్తే కామెడీ దుమ్ము దులపడం ఖాయం. నేను అయితే ఒక సీన్ పెట్టేవాడిని… ఇద్దరూ తాగొచ్చి నయనతార దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందో చూపించేవాడిని” అని నవ్వులు పూయించారు. మొత్తంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ ఈవెంట్లో రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.