Allu Arjun | ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేయగా.. తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్ట్ చేశారు. సెక్యూరిటీగార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్‌పై బీఎన్ఎస్ 118 (1), బీఎన్ఎస్ 105, రెడ్‌విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్ (నాన్ బెయిలబుల్ కేసు) కింద ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఇప్పటికే ఆమె రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు.
ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ పిటిషన్..
కాగా చికడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఇప్పటికే థియేటర్ యాజమాన్యం, భాగస్వాములు పిటిషన్లు దాఖలు చేశారని తెలిసిందే. ఆ తర్వాత అల్లుఅర్జున్ కూడా పిటిషన్ దాఖలు చేశాడు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు నటులు వెళ్తుంటారని, ఇది సహజంగా జరిగేదేనని తెలిపాడు.
ఇదివరకు కూడా పలుమార్లు సినిమా ప్రదర్శనల సమయంలో తాను వెళ్లానని.. ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని అల్లు అర్జున్ తెలిపాడు. సంధ్య థియేటర్‌కు వెళ్లేముందు తాను థియేటర్ నిర్వాహకులకు, స్థానిక ఏసీపీ తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. భద్రత కోసం ముందస్తుగా సమాచారం ఇచ్చామని.. ఇందులో తన నిర్లక్ష్యమేమీ లేదన్నాడు.
తాను థియేటర్‌కు వెళ్లిన కారణంగానే తొకిసలాట జరిగిందని మృతురాలి భర్త ఫిర్యాదులో పేరొనడం సరికాదని అన్నాడు. ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేసిన అభియోగాలేవీ తనకు వర్తించవని తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ ప్రక్రియను నిలిపివేయాలని, ఈలోగా తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నాడు అల్లు అర్జున్. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Breaking
Superstar Allu Arjun has been arrested in the stampede case. #AlluArjun #Pushpa2 pic.twitter.com/8Xq5sgoRxG
— Sneha Mordani (@snehamordani) December 13, 2024
Mohan Babu | కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు..స్టేట్మెంట్ రికార్డ్..!
Singham Again | ట్విస్ట్‌తో అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ ఓటీటీ ఎంట్రీ
Daaku First Single | డేగ డేగ డేగ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ డాకు మహారాజ్ సాంగ్ ప్రోమో