Daaku First Single | బాబీ (Bobby) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటిస్తోన్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా వస్తోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. డేగ డేగ డేగ.. అంటూ సాగుతున్న ప్రోమో ( Daakus rage)గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నకాశ్ అజీజ్ పాడాడు. బాలకృష్ణ గండ్రగొడ్డుళ్లు పట్టుకొని సమరంలో ఉన్న లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మేకర్స్ యూఎస్ఏ టెక్సాస్‌లోని డల్లాస్‌లో 2025 జనవరి 4న Texas Trust CU Theatreలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
డాకు మహారాజ్ సాంగ్ ప్రోమో..
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Get ready for the GRAND PRE-RELEASE EVENT of #DaakuMaharaaj on 4th January at Dallas, Texas! 🇺🇸🤩⚡️
📍Texas Trust CU Theatre, from 6PM Onwards! 💥
Brace yourselves for the ultimate 𝐌𝐀𝐒𝐒 𝐄𝐗𝐏𝐋𝐎𝐒𝐈𝐎𝐍 on Jan 12, 2025 in Cinemas Worldwide. 🤙🏻🔥
Event by @shreyasgroup… pic.twitter.com/XVjBx7mitM
— BA Raju’s Team (@baraju_SuperHit) December 8, 2024
Satyadev | బ్రతికిపోయాం.. ముఫాసా ది లయన్ కింగ్‌లో టాకాకు సత్యదేవ్ వాయిస్
Coolie | తలైవా బర్త్ డే స్పెషల్.. కూలీ షూట్ లొకేషన్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!