
అల్లరి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేశ్ గా మారిపోయాడు. ఈ ఏడాది నాంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా..ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓ వైపు ఎంటర్ టైనింగ్ చిత్రాలు చేస్తూనే..మరోవైపు ఆలోచింపజేసే ప్రాజెక్టులు చేస్తుంటాడు నరేశ్. ఈ యువ నటుడు తాజాగా మరో సినిమాతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడు. అల్లరి నరేశ్ కొత్త సినిమా ‘సభకు నమస్కారం’.
నరేశ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. టక్ వేసుకున్న నరేశ్ స్టేజీపై నుంచి చేతులెత్తి నమస్కరిస్తున్న స్టిల్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. సతీశ్ మల్లంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. హెలేరియస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో నరేశ్ ఫన్ అవతార్ లో కనిపింబోతున్నాడు.
అబ్బూరి రవి స్క్రీన్ రైటర్ గా పనిచేయనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ అల్లరోడికి పుట్టినరోజు సందర్భంగా సినీ లవర్స్, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
#Naresh58 is #SabhakuNamaskaram .. a hilarious entertainer with a difference starring @allarinaresh and directed by @MallampatiSate1. Produced by Mahesh S Koneru on @EastCoastPrdns with dialogues by @abburiravi . Shoot begins soon #HBDAllariNaresh pic.twitter.com/JDNFiVMv8C
— BA Raju's Team (@baraju_SuperHit) June 30, 2021
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న.