Alia Bhatt | ప్రాణ ప్రతిష్టలో ప్రత్యేక ఆకర్షణగా అలియా భట్.. రామాయణం ఇతివృత్తంతో డిజైన్ చేసిన చీరలో మెరిసిన నటి
Alia Bhatt | బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరను ధరించి ఆకట్టుకుంది.
Alia Bhatt | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో బాలరాముడి రూపంలో శ్రీరాముడు ఎట్టకేలకు కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం దివ్య ముహూర్తాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, పలు రంగాలకు చెందిన 8 వేల మందికి పైగా ప్రముఖులు హాజరై బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి అలియా భట్ (Alia Bhatt ) మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందుకు కారణం ఆమె ధరించిన చీర.
భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో అయోధ్య చేరకున్న అలియా.. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మైసూర్ సిల్క్ చీరను ధరించింది. అలియా ఏ కార్యక్రమానికి వెళ్లినా తన వస్త్రధారణలో ప్రత్యేకత చాటుతుంది. ఈ క్రమంలోనే అయోధ్య పర్యటనలో కూడా రామాయణం ఇతివృత్తం ఆధారంగా (Ramayan themed saree ) ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరను ధరించి ఆకట్టుకుంది. లైట్ గ్రీన్ రంగు సిల్క్ చీర కొంగు అంచుపై రామాయణాన్ని కళ్లకు కట్టేలా చూపించింది.
చీరపై రామసేతు, హనుమాన్, రాముడు శివ ధనుస్సును బద్దలు కొట్టడం, రాముడి వనవాసం, గంగానదిపై వంతెన, బంగారు జింక, సీతను అపహరించడం.. తదితర ఘట్టాలను ఆ చీరపల్లుపై ముద్రించారు. ఈ పల్లు మొత్తం చేత్తో డిజైన్ చేసింది కావడం విశేషం. లేబుల్ మథుర్యా ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చీర ఖరీదు రూ.45వేలు అని సమాచారం. ఈ చీర ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాణ ప్రతిష్ట వేళ.. రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించిన అలియా భట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read..
Ram Mandir | భక్తజనసందోహంగా అయోధ్యాపురి.. బాలరాముడిని దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు
Elon Musk | భద్రతా మండలిలో మార్పులు అవసరం.. భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై మస్క్ స్పందన
Zomato | ప్రాణ ప్రతిష్ట వేళ.. నాన్‌వెజ్‌ను నిషేధించిన జొమాటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

