ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 12:18:52

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది : అక్ష‌య్ కుమార్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని..  ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది : అక్ష‌య్ కుమార్‌

హైదరాబాద్: బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న ఫ‌స్ట్ ల‌వ్ స్టోరీని షేర్ చేసుకున్నాడు. ట్వింకిల్ ఖ‌న్నాను పెళ్లి చేసుకున్న అక్ష‌య్‌.. అంత‌కు ముందు ఓ అమ్మాయితో అఫైర్ సాగించాడు.  ఆ అమ్మాయితో డేటింగ్ చేసిన అక్ష‌య్ ఆమెకు న‌చ్చిన‌ట్లు ఉండ‌లేకపోయాడు.  దీంతో ఆ అమ్మాయి అక్ష‌య్‌ను వ‌దిలేసింది. ఈ విష‌యాన్ని ద క‌పిల్ శ‌ర్మ షోలో అక్ష‌యే స్వ‌యంగా చెప్పాడు.  టీనేజీలో ఓ అమ్మాయితో నాలుగైదు సార్లు డేటింగ్‌కు వెళ్లాన‌ని, ఓ సారి ఆ అమ్మాయితో సినిమా చూశాన‌ని, ఉడిపి రెస్టారెంట్ వెళ్లి భోజ‌నం కూడా చేశామ‌న్నారు.  కానీ ఆ త‌ర్వాత ఆమె త‌న‌ను వ‌దిలి వెళ్లింద‌న్నారు.  ఆ అమ్మాయి ఎందుకు త‌న‌ను వ‌దిలేసి వెళ్లిందో కూడా చెప్పాడ‌త‌ను.   

కిస్సు ఇవ్వ‌క‌పోవ‌డం.. హ‌త్తుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆ అమ్మాయి త‌న‌ను వ‌దిలి వెళ్లిన‌ట్లు అక్ష‌య్ చెప్పాడు.  ముందు నుంచి నాకు సిగ్గు ఓ స‌మ‌స్య‌గా మారేద‌ని, భుజంపై నేనెప్పుడూ చేయ‌వేయ‌లేద‌ని, ఎప్పుడూ చేయి కూడా ప‌ట్టుకోలేద‌న్నాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం త‌న చేయి ప‌ట్టుకోవాల‌ని కోరుకునేద‌న్నాడు.  కిస్ ఇవ్వాలి, ఇంకేదో చేయాల‌న్న ఆలోచ‌న ఆ అమ్మాయికి ఉండేద‌న్నారు. కానీ నేను అలా చేయ‌లేక‌పోయాన‌ని, అందువ‌ల్లే ఆ అమ్మాయి న‌న్ను వ‌దిలేసి వెళ్లిన‌ట్లు అక్ష‌య్ కుమార్ తెలిపాడు. అయితే 20 ఏళ్ల క్రిత‌మే ట్వింకిల్ ఖ‌న్నాను అక్ష‌య్ పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. 


VIDEOS

logo