Sarfira | బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ (Akshay kumar) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సర్ఫీరా’(Sarfira). కోలీవుడ్ స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara) దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదల సర్ఫీరా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సయిన వారి కోసం ఓటీటీ అప్డేట్ అందించాడు అక్షయ్ కుమార్.
సామాన్యుడి కలలు సర్ఫిరాలో ఎలా ఎగురుతున్నాయో చూడండి.. సర్ఫీరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి ప్రీమియర్ కానుందని తెలియజేస్తూ వీడియో షేర్ చేశాడు అక్షయ్‌కుమార్. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకేంటి మరి ఓటీటీలో మీరూ సినిమాపై ఓ లుక్కేయండి.
సూర్య కాంబోలో వచ్చిన సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి హిందీ రీమేక్‌గా తెరకెక్కింది సర్ఫీరా. ఈ చిత్రంలో సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. ఒరిజినల్ వెర్షన్లో సూర్య పాత్రను మించిపోయేలా అక్షయ్ కుమార్ తన పాత్రలో జీవించేశాడని ఇప్పటికే వచ్చిన రివ్యూస్ క్లారిటీ ఇచ్చేశాయి.
ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్టైన్మెంట్, సూర్య హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. తనిష్క్ బాగ్ఛీ, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు.
Apne sapnon ko poora karne ke liye, #Sarfira hona padta hai!
Watch the dreams of a common man soar in Sarfira, streaming only on Disney+ Hotstar from October 11.@DisneyPlusHS pic.twitter.com/gLOZ2oXCtw
— Akshay Kumar (@akshaykumar) September 26, 2024
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్