అఖిల్‌కు ఒక్క హిట్ వస్తే బాగున్నురా..కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే చేసిన మూడు సినిమాలు అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కి నిరాశనే మిగిల్చాయి. హలో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా నిలబడలేదు. మిస్టర్ మజ్ను యావరేజ్ టాక్ తో ఓపెన్ అయి డిజాస్టర్ అయిపోయింది. ఇలాంటి సమయంలో ఈయన హీరోగా నిలబడాలన్నా.. మార్కెట్ ఓపెన్ కావాలన్నా కూడా కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. మరో ఆప్షన్ లేదు. ప్రస్తుతం అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (bommarillu bhaskar) తెరకెక్కిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bacherlor) . వరుస విజయాలతో దూసుకుపోతున్న సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఈ సినిమా వస్తుంది.
గీతా ఆర్ట్స్ 2 నిర్మాణంలో బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను నిర్మించారు. ఈ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. వరస ఫ్లాపుల్లో ఉన్న భాస్కర్‌ను నమ్మి గీతా ఆర్ట్స్ అవకాశం ఇచ్చినపుడే.. కథ చాలా బలంగా ఉందనే విషయం ప్రేక్షకులకు అర్థమైపోయింది. ఇప్పుడు విజువల్స్ చూసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చేసింది. కచ్చితంగా అఖిల్ ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టడం పక్కా అంటూ పండగ చేసుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా ఆడియో బ్లాక్‌బస్టర్ కావడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
లెహరాయీతో పాటు మనసా మనసా, చిట్టి అడుగు పాటలకు అద్భుతమైన స్పందన వస్తుంది. ట్రైలర్ కూడా అదిరిపోయింది. లైట్ కామెడీతో పాటు ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాడు బొమ్మరిల్లు భాస్కర్. ఎవరైనా సరే రిలేషన్ షిప్‌లోకి దిగే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి అనేది ఈ చిత్రం నుంచి భాస్కర్ చెప్తున్న లైన్. కచ్చితంగా అందరి మనసులను తాకేలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఉంటుందని పదే పదే చెప్తున్నారు చిత్రయూనిట్. వాళ్ల నమ్మకానికి ఏ మాత్రం తీసిపోకుండా సినిమా కూడా ఉంటుందని అభిమానులు కూడా నమ్ముతున్నారు.
అఖిల్, పూజా హెగ్డే (Pooja Hegde) కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధానాకర్షణ. కచ్చితంగా ఇవన్నీ కలిపి దసరా సీజన్లో అక్టోబర్ 15న వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు పెద్ద విజయం అందిస్తుందని దర్శక నిర్మాతలు బలంగా చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు