Agent Movie Antagonist Photo | అక్కినేని అఖిల్ ఎన్నో ఎళ్ళుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’తో హిట్టు సాధించినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ఏజెంట్’ సినిమాపైనే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమాలోని ప్రతి నాయకుడి ఫోటోను రిలీజ్ చేస్తూ.. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఫోటోలో విలన్ మొహం కనిపించకుండా.. ఒళ్ళంతా దుస్తులు ధరించి, చేతిలో గన్ పట్టుకుని తీవ్రవాదిలా ఉన్నాడు. ఈ ఫోటోతో విలన్ ఎవరా అనే అత్రుతను క్రియేట్ చేశారు. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Kantara Movie | ‘కాంతారా’ మూవీ సరికొత్త రికార్డు.. తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి..!
Geeta Singh | కమెడియన్ గీతా సింగ్ అన్ని కోట్లు నష్టపోయిందా?
Salaar Movie | ‘వర్ధరాజ మన్నార్’గా పృథ్విరాజ్ సుకుమారన్.. ఆసక్తికరంగా ‘సలార్’ పోస్టర్
NBK107 నుండి క్రేజీ అప్డేట్.. నందమూరి అభిమానులకు పండగే..!