టాలీవుడ్ (Tollywood) హీరో బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శీను (Boyapati Srinu) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండ (Akhanda). ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌తో ట్రైలర్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు. అఖండ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కొత్త పోస్టర్‌తో తాజా అప్డేట్ను విడుదల చేశాడు మేకర్స్.
బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ స్టైలిష్ లుక్‌లో జీపులో కూర్చొని టీ తాగుతున్న పోస్టర్ కొత్తగా ఉంది. ఈ లుక్ సినిమాపై క్రేజ్‌ను పెంచేస్తుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా నటించగా..జగపతిబాబు కీలకపాత్రలో నటించాడు. బాలకృష్ణ స్టైలిష్ లుక్‌లో, మరోవైపు అఘోరా లుక్‌లో అభిమానులకు పసందైన వినోదాన్ని పంచడం ఖాయమని ఇప్పటివరకు విడుదలైన రషెస్ చెబుతున్నాయి.
Censor formalities done with U/A
— BA Raju's Team (@baraju_SuperHit) November 21, 2021
Unstoppable #Akhanda 🦁 Roaring to release on 2nd Dec!
🔗 https://t.co/2jRvp8yKIp#NandamuriBalakrishna #BoyapatiSreenu @ItsMePragya @IamJagguBhai @actorsrikanth @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @LahariMusic pic.twitter.com/oL0f5g3vB0
ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వచ్చిన అఖండ టైటిల్ ట్రాక్ సినీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అనంత్ శ్రీరామ్ఈ పాటను రాయగా..లెజెండరీ సింగర్ శంకర్ మహదేవన్, తన కుమారులు సిద్దార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్‌తో కలిసి పాడాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక