Magizh Thirumeni | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఏకే 62గా వస్తోన్న విదాముయార్చి (Vidaa Muyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో పట్టుదల టైటిల్‌తో వస్తోంది. అజిత్‌కుమార్ సినిమాలతో అభిమానులకు వినోదాన్ని పంచడమే కాదు.. మల్టీ టాలెంటెడ్ స్కిల్స్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తుంటాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మగిజ్ తిరుమేని అజిత్ కుమార్ గురించి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అజిత్ కుమార్ టీం ఇటీవలే దుబాయ్ కార్ రేసింగ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచిందని తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మగిజ్ తిరుమేని ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు.
అజిత్ కుమార్ మనకు నటుడిగా మాత్రమే తెలుసు. అజిత్‌కుమార్ బైకర్ అండ్ కార్ రేసర్ మాత్రమే కాదు.. చాలా విషయాల్లో ఎక్స్పర్ట్. ఆయనకు ఫొటోగ్రఫీలో మంచి ప్రావీణ్యం ఉంది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆయన ఫొటోలు చాలా బహుమతులు గెలుచుకున్నాయి. అంతేకాదు రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్లో కూడా బహుమతులు గెలుచుకున్నాయి. ఆయనతో పోటీపడేవాళ్లు ఆటలో గెలవాలంటే చాలా ప్రాక్టీస్ చేస్తారు. కానీ అజిత్ కుమార్ మాత్రం షూటింగ్ పూర్తయ్యాక వెళ్లి ప్రైజ్ గెలుచుకొని వస్తారు. ఈ డెడికేషనే ఆయనకు అన్ని రకాల విజయాలను అందిస్తుందని చెప్పుకొచ్చాడు మగిజ్ తిరుమేని. అజిత్కుమార్కున్న స్కిల్స్ చాలా మందిలో స్పూర్తి నింపుతాయడనంలో ఎలాంటి సందేహం లేదు. .
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్ర పోషిస్తుండగా.. రెజీనా కసాండ్రా, ఆరవ్ మరో కీ రోల్స్‌లో నటిస్తున్నారు. అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఏకే 63 కూడా చేస్తున్నాడు.. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?