బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాడు స్టార్ హీరో అజిత్ (Ajith) . ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం హెచ్ వినోథ్ దర్శకత్వంలో తునివు (Thunivu)సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్.
కాగా ఇపుడు అజిత్ అభిమానులకు నిరాశ కలిగించే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తునివు విడుదల తర్వాత అజిత్ లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. అజిత్ 6 నుంచి 8 నెలలు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్టు జోరుగా టాక్ నడుస్తోంది. ఈ బ్రేక్ టైంను రిలాక్సేషన్ కోసం, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేందు కోసం వినియోగించుకోనున్నాడట అజిత్. బ్రేక్ టైం పూర్తయ్యాక శివ (Siva) దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
ఎప్పుడూ షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉండే అజిత్ టైం దొరికితే సరదాగా లాంగ్ బైక్ ట్రిప్ వేస్తూ.. రిలాక్స్ అవుతుంటాడని తెలిసిందే. తన స్నేహితులతో కలిసి రోడ్ట్రిప్ను ఎంజాయ్ చేస్తూ.. సరదా క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంటాడు.
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?