కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వలిమై. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అప్ డేట్ రానే వచ్చింది. వలిమై మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అజిత్ చెడ్డ వాళ్ల భరతం పట్టే వన్ మ్యాన్ ఆర్మీలా కనిపిస్తూ మోషన్ పోస్టర్ లో అదరగొడుతున్నాడు. స్పోర్ట్స్ ఇంటెన్స్ లుక్ లో బైకుపై వెళ్తున్న సీన్ స్టన్నింగ్ గా ఉంది. 2021లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పిన మేకర్స్ ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం చెప్పలేదు.
వలిమై తప్పకుండా థియేటర్లలోనే విడుదలవుతుందని తాజా అప్ డేట్ ద్వారా అర్థమవుతుంది. మేకర్స్ అజిత్ డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న పోస్టర్లను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. బైకుపై కూర్చున్న స్టిల్‌తోపాటు యాక్షన్ పార్టులో తీసిన పోస్టర్ స్టన్నింగ్ లుక్ లో ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. మే 1న అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడుతూ వచ్చింది. హెచ్ వినోథ్ డైరెక్టన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు.
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
మా ఎన్నికలు..ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ సెటైరికల్ రిప్లై
బంగార్రాజు చిత్రంలో ‘బేబమ్మ’..?