Bishnoi Gang | ప్రముఖ హిందీ హాస్య నటుడు కపిల్ శర్మ (Kapil Sharma) కెఫెపై దుండగులు మరోసారి కాల్పులు తెగబడిన విషయం తెలిసిందే. కెనడాలోని ఆయన నడుపుతున్న కఫ్స్ కెఫె (KAP’S CAFE)పై గురువారం కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు. కారులో వచ్చి.. కెఫెకు సమీపంగా వెళ్తూ దాడికి పాల్పడిన వీడియో నెట్టింట వైరలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో కాల్పుల ఘటన. ఇది తమ పనే అని గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ ఆన్లైన్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే హాస్యనటుడిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ (Bishnoi Gang)నకు చెందిన హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ ఆడియోను రికార్డ్ చేశాడు. ‘కపిల్ శర్మకు చెందిన రెస్టారంట్లో ఇటీవల, ఇప్పుడు కాల్పులు జరిగాయి. నెట్‌ఫ్లిక్స్ షోకి సల్మాన్‌ఖాన్‌ను ఆహ్వానించడమే అందుకు కారణం’ అని ఆడియోలో పేర్కొన్నాడు. సల్మాన్‌ఖాన్‌తో పనిచేసే దర్శకుడు, నిర్మాత, నటులను చంపేస్తానంటూ అతడు హెచ్చరికలు చేశాడు. ‘సల్మాన్‌తో కలిసి ఎవరైనా పనిచేస్తే.. అది చిన్న నటుడైనా, చిన్న దర్శకుడైనా సరే మేము ఎవరినీ వదిలిపెట్టము. చంపేస్తాం. వారిని చంపడానికి ఎంతకైనా తెగిస్తాము’ అని అందులో బెదిరించాడు.
జూలై నెలలో కెనడాలో కపిల్ కప్స్ కెఫెను ప్రారంభించారు. కెఫెన్ తెరిచిన కొన్నిరోజులకే సిబ్బంది లోపల ఉండగానే ఉదయం 1:50 సమయంలో పలుమార్లు కాల్పులు జరిపారు దుండగులు. కెఫె కిటికీలపై పది బుల్లెట్ రంధ్రాలు ఏర్పడ్డాయి. అయితే.. అదృష్టవశాత్తూ ఆ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ‘ది కపిల్ శర్మ షో’తో పాపులర్ అయిన కపిల్ హీరోగాను వెండితెరపై మెరిశాడు. క్రూ, ఫిరంగీ, ట్యూబ్‌లైట్, కిస్ కిస్కో ప్యార్కరూన్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించాడీ కామెడీ కింగ్.
Also Read..
Raksha Bandhan 2025 | చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా..?
Air Force Chief | ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం : ఎయిర్ ఫోర్స్ చీఫ్
Ajit Doval | రష్యా ఉప ప్రధానితో అజిత్ దోవల్ భేటీ.. మిలిటరీ-సాంకేతిక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు