Raksha Bandhan 2025 | ఆగస్టు 9.. నేడు రాఖీ పౌర్ణమి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పండుగ (Raksha Bandhan 2025). ఈ సందర్భంగా దేశ ప్రజలు నేడు రక్షాబంధన్‌ను వేడుకగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ సోదరులకు ప్రేమగా రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రక్షా బంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Prime Minister Narendra Modi celebrates #RakshaBandhan2025 at 7 LKM, the PM’s residence, in Delhi. pic.twitter.com/BnsY4rrrd6
— ANI (@ANI) August 9, 2025
ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు ఇవాళ ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి రాఖీలు కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ.. చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటించారు. రాఖీలు కట్టే సమయంలో ఆ విద్యార్థినుల పేర్లు, క్లాస్ ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిన్నారులతోపాటూ బ్రహ్మకుమారీలు సైతం ప్రధానికి రాఖీ కట్టారు.
Prime Minister Narendra Modi celebrates #RakshaBandhan2025 with children at 7 LKM, the PM’s residence, in Delhi. pic.twitter.com/1BsJJxnmud
— ANI (@ANI) August 9, 2025
Also Read..
Air Force Chief | ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం : ఎయిర్ ఫోర్స్ చీఫ్
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో
ICICI Bank: ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు