Janhvi Kapoor | శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్
Janhvi Kapoor | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swami) ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు.
Janhvi Kapoor | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swami) ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాన్వీతో కలిసి మరో నటి మహేశ్వరి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా జాన్వీ సాంప్రదాయ చీర కట్టులో ఎంతో అందంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదే సమయంలో తిరుమల పర్యటకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలన జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
#WATCH | Andhra Pradesh | Actress Janhvi Kapoor visits Sri Venkateswara Swami Temple in Tirumala to offer prayers. pic.twitter.com/ujbv32kNM7
— ANI (@ANI) January 5, 2024
ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’లో నటిస్తోంది. ఈ మూవీతో జాన్వీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Also Read..
Cold Wave | ఉత్తరాదిపై చలి పంజా.. ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
Hindu Temple | మరోసారి రెచ్చిపోయిన తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు
Ship Hijacked | 15 మంది భారతీయులు ఉన్న నౌక హైజాక్.. రంగంలోని ఇండియన్ నేవీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

