తల్లిదండ్రులపై కేసు పెట్టిన తమిళ హీరో విజయ్.. కారణం ఏంటంటే..
Tamil actor Vijay: తమిళ హీరో విజయ్ ఆదివారం తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సిటీ కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. వారు అనుమతి లేకుండా తన పేరును వినియోగిస్తున్నారని విజయ్ తన సివిల్ సూట్లో

Thalapathy vijay | తమిళ హీరో విజయ్ ఆదివారం తన తల్లిదండ్రులు సహా 11 మందిపై చెన్నై సిటీ కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. వారు అనుమతి లేకుండా తన పేరును వినియోగిస్తున్నారని విజయ్ తన సివిల్ సూట్లో పేర్కొన్నారు. ఇకపై వాళ్లు తన పేరుతో ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయకుండా, కార్యక్రమాలు నిర్వహించకుండా స్టే ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అంతేగాక, వాళ్లు తన పేరుతో స్థాపించిన ఆలిండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ రాజకీయ పార్టీని రద్దు చేయాలని విజయ్ కోరారు.
కాగా, విజయ్ దాఖలు చేసిన సివిల్ సూట్‌పై కోర్టు ఈ నెల 27న విచారణ జరుపనున్నది. ఇంతకూ ఏమైందంటే ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆయన జనరల్ సెక్రటరీగా, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. అయితే, వాళ్లు పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్.. “మా నాన్న పెట్టిన పార్టీతో నాకు నేరుగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి సంబంధం లేదు. నా ఫ్యాన్స్ ఎవరూ ఆ పార్టీలో చేరవద్దు” అంటూ ఒక ప్రకటన చేశారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్ క్లబ్‌ను ఎవరైనా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
చీరలు అంటే చాలా ఇష్టమే.. కానీ అదొక్కటే సమస్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్
Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్
MAA Elections 2021 : ఎట్టకేలకు మా అధ్యక్ష ఎన్నికల తేదీలు ఖరారు.. మరి కండిషన్స్ ఏంటో తెలుసా !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

