Sai Durga Tej | టాలీవుడ్ నటుడు సాయి దుర్గతేజ్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy)ని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖతోపాటు కాంగ్రెస్ ఎంపీ చామాల కిరణ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇటీవలే తండ్రి, కూతురి మధ్య వున్న అనుబంధానికి మచ్చ తెచ్చేలా యూట్యూబ్‌లో ఓ వీడియోను కామెంట్ చేసిన వ్యవహారంలో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు నీచ బుద్దిని సాయి దుర్గ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ విలువలకు మచ్చ తేచ్చేలా ఫన్ పేరుతో చిన్న పిల్లలను ట్రోల్ చేస్తున్న, ప్రణీత్ హనుమంతు లాంటి వారిని కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు సాయి దుర్గ తేజ్. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి స్పందించగా, ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ప్రభుత్వం సకాలంలో తన ట్వీట్‌కు స్పందించిన తీరుకు కృతజ్ఞతగా సాయి దుర్గ తేజ్ ఈ రోజు ముఖ్యమంత్రిని కలిసి తన అభినందనలు తెలియజేశారు.
చిన్నారులపై ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో వేధింపులను అరికట్టడం, చిన్నారులకు మంచి స్నేహ పూర్వక వాతావరణం కల్పించడం అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాడు సాయి దుర్గతేజ్. ఆన్లైన్లో చిన్నారులపై అసభ్యకరంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇప్పటికే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇటీవలే తండ్రీకూతుళ్ల బంధంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ప్రస్తుతం ప్రణీత్ హనుమంతు చంచల్‌గూడలో జైలు జీవితం గడుపుతున్నాడు.
సినిమాలతో వినోదాన్ని అందిస్తూనే.. మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో ముందుంటాడు సాయి దుర్గతేజ్.
ఇటీవలే ‘సామాజిక సందేశం వున్న సత్య సినిమాతో దేశ సైనికుల త్యాగాలు, వారి కుటుంబ త్యాగాలు అందరికి తెలియజేసిన సాయి దుర్గ తేజ్.. ప్రభుత్వం తరపున చేపట్టే రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
Mega Supreme Hero @IamSaiDharamTej meets Hon’ble Chief Minister @revanth_anumula Garu to thank him on his swift action in the recent child abuse case.
He has also discussed ways to curb child abuse and make society a better place for children both offline & online. pic.twitter.com/RMsv3RhTlr
— BA Raju’s Team (@baraju_SuperHit) July 14, 2024
Hunger | కంటెంట్ మ్యాటర్.. హంగర్‌కు అంతర్జాతీయ గుర్తింపు
Sarfira | అక్షయ్‌కుమార్-సూర్య సర్ఫిరా వసూళ్లు ఎంతంటే..?
Bhahishkarana | అంజలి ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలో..? హాట్ టాపిక్‌గా బహిష్కరణ