హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తాజాగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమని చెప్పారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అదృష్టంగా బావిస్తున్నానన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి, ఒక యజ్ఞంలా ముందుకు తీసుకువెళ్తున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. తన వంతుగా వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యం చేస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని రాజ్‌మార్ వెల్లడించారు.