Actor Kasthuri | కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్లలో తమిళ నటి కస్తూరి శంకర్ (Kasthuri Shankar) ముందు వరుసలో ఉంటారు. కస్తూరి ఇటీవలే తెలుగు (Telugu remarks) వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ రాజకీయ సభలో ఆమె తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆమె తీరుపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి.
దాంతో ఆమె తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. తాను తెలుగు వారిని కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రకటించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కస్తూరిపై చెన్నైలో ఇదే విషయమై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదం నేపథ్యంలో ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వివాదం నేపథ్యంలో విచారణ నిమిత్తం పోలీసులు చెన్నైలోని పోయెస్ గార్డెన్లోని నటి ఇంటికి వెళ్లగా.. అక్కడ ఆమె జాడ కనిపించలేదు. ఫోన్ కూడా స్విచ్ఆఫ్లో ఉన్నట్లు తెలిసింది. నాలుగు రోజులైనా ఇప్పటికీ ఆమె ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్లో ఆశ్రయం పొందుతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి.
తమిళనాడులో జరిగిన బీజేపీ సభలో కస్తూరి మాట్లాడుతూ.. రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. 300 ఏండ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం తమిళనాడు ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు. ఇతర భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంది చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోందని కామెంట్స్ చేసింది.. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో క్లారిటీ ఇచ్చింది కస్తూరి. తెలుగు ప్రజల గురించి నేను వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు అధికార డీఎంకే పార్టీకి చెందిన కొందరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సభలో ద్రావిడ సిద్దాంత వాదులను, వారి ఐడియాలజీపై నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. నా కుటుంబం తెలుగు వాళ్లు అని తెలియక ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ ట్రాప్లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కస్తూరి ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.
Also Read..
Better Sleep | నిద్రలేమితో బాధపడుతున్నారా..? అయితే 3-2-1 రూల్ ట్రై చేసి చూడండి
Mohammad Shami | ఏడాది తర్వాత తిరిగి భారత క్రికెట్ జట్టులోకి లాలాజీ..!
Car-Truck Collision: ట్రక్కును ఢీకొన్న ఇన్నోవా కారు.. ఆరుగురు విద్యార్థులు మృతి