Chinmayi Sripaada | ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై సోషల్‌మీడియా వేదికగా తరచూ గళం విప్పుతూ ఉంటారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, అఘాయిత్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతుంటారు. ఇక మీటూ ఉద్యమకాలం నుంచి స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం కోసం గొంతెత్తుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా పేరు తేచ్చుకున్నారు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై ఆమె చేసిన ఆరోపణలు తమిళ చిత్రసీమలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే, తాజాగా ఆమె మరో నటుడిపై సంచలన ఆరోపణలు చేశారు.
సలార్ నటుడు జాన్ విజయ్ (John Vijay) గతంలో చాలా మంది మహిళల్ని వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన మహిళా జర్నలిస్టుతోనూ జాన్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. అతని ప్రవర్తనపై పలువురు మహిళలు తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను కూడా చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇందులో ఉంది. ప్రస్తుతం చిన్మయి ట్వీట్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
జాన్ విజయ్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నాడు. విలన్, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ‘ఓరం పో’, ‘సర్పట్ట పరంబరై, ‘సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్’ లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు. అలాగే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోనూ, బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలోనూ కీలక పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పించారు జాన్ విజయ్.
More on John Vijay from others who read the post.
One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn
— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024
Also Read..
Vikrant Massey | ’12 ఫెయిల్’ సినిమాకు నేషనల్ అవార్డు అంటూ వార్తలు.. హీరో రియాక్షన్ ఇదే.!
Samantha | సమంతా సిటాడెల్కు డేట్ కన్ఫర్మ్ అయ్యిందా?
Keerthy Suresh | వాటిని అస్సలు పట్టించుకోను.. ఆ అబద్ధాన్ని నిజం చేసేస్తారు: కీర్తి సురేశ్