Samantha | సమంతా సిటాడెల్కు డేట్ కన్ఫర్మ్ అయ్యిందా?
సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్ననటి సమంతా. అగ్ర కథానాయికలలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ల లో సమంతా ఒకరు. అక్కినేని నాగచైతన్య హీరోగా ఏ మాయ చేసావే సినిమాతో తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆతరువాత ఈ భామ ఈగ, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, రంగస్థలం, మహానటి, మజిలీ వంటి చిత్రాలలో నటించింది. రాజ్ అండ్ డీకే రూపొందంచిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలి మ్యాన్, ఫార్జీలోను తనదైన శైలిలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఆ తరువాత ఈ భామ నటించిన శాకుంతలం, ఖుషీ చిత్రాలు డిజాస్టర్ లుగా నిలిచాయి.సమంతా అక్కినేని నాగచైతన్యతో వివాహం జరగడం ఆ తరువాత వారి వివాహబంధంలో కొన్ని ఒడిదుడుకుల వల్ల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత సామ్ మయోసిటిస్ అనే వ్యాధి తో అనారోగ్యానికి గురైంది. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ షూటింగ్‌లతో బిజీ కావాలని ఆమె కోరుకుంటోంది. ఇటీవలే ఈ అందాల తార తన పుట్టిన రోజు సందర్బంగా మా ఇంటి బంగారం అనే సినిమాను తన సొంత నిర్మాణంలో నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదు.
వీటితో పాటు ఈ భామ నటించనున్న మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో వున్నాయని తెలిసింది. ఇదిలా వుండగా సమంతా ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ సిరీస్ లో నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి ఆగష్ట్ 1 న అప్ డేట్ రాబోతుంది అని సమాచారం. ఆ అప్ డేట్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారా? అని సమంతా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read :
Keerthy Suresh | వాటిని అస్సలు పట్టించుకోను.. ఆ అబద్ధాన్ని నిజం చేసేస్తారు: కీర్తి సురేశ్
Parineeti Chopra | టైమ్ వేస్ట్ చేసుకోకు.. ఇతరుల్ని మెప్పించడం మొదలుపెడితే ఇక అంతే!: పరిణితీ చోప్రా
Ajith Kumar | జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా అజిత్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

