Parineeti Chopra | ‘విలువలేని మనుషుల గురించి పట్టించుకోవడం మానేస్తే మంచిది. పనికిమాలిన ప్రపంచానికి దూరంగా బతకండి. మనం ఆనందంగా బతకాలి. మనవారిని కూడా ఆనందంగా ఉంచాలి. ఇదే నిజమైన జీవితం.’ అంటూ తన ఇన్‌స్టా ద్వారా అభిమానులకు మెసేజ్ చేసింది బాలీవుడ్ భామ పరిణితీ చోప్రా. రీసెంట్గా ‘అమర్‌సింగ్ చంకీల’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను వివాహం ఆడిన పరిణితీ.. ఓవైపు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌చేస్తూ, మరోవైపు ఇన్‌స్టా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంది.
రీసెంట్గా ఆమె అభిమానులకోసం విలువైన విషయాలతో ఓ పోస్ట్ పెట్టింది. ‘బతకడం జంతువులు కూడా చేస్తాయి. జీవించడం మనిషి మాత్రమే చేస్తాడు. జీవితంలో ప్రతిక్షణం విలువైనది. ఆ సమయాన్ని ఇతరుల మెప్పుకోసం వృథా చేసుకోకు. నీకు నచ్చినట్టు జీవించు. ఇతరుల్ని మెప్పించడం మొదలుపెడితే.. జీవించడం మరిచిపోతాం.’ అంటూ అద్భుతంగా రాసుకొచ్చింది పరిణితీ.