Vikrant Massey | ’12 ఫెయిల్’ సినిమాకు నేషనల్ అవార్డు అంటూ వార్తలు.. హీరో రియాక్షన్ ఇదే.!
Vikrant Massey | గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం 12 ఫెయిల్ (12th Fail). బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్లు వసుళ్లు చేసింది.
Vikrant Massey | గతేడాది బాలీవుడ్ నుంచి వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం 12 ఫెయిల్ (12th Fail). బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.64 కోట్లు వసుళ్లు చేసింది. ఇక ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమా ఇప్పటికే పలు అవార్డులు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నేషనల్ అవార్డులలో కూడా పోటి పడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో నటనకు గాను విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడిగా.. అలాగే ఉత్తమ చిత్రంగా ఈ సినిమాలో నేషనల్ అవార్డుల బరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా హీరో విక్రాంత్ మాస్సే స్పందించాడు. 12 ఫెయిల్ సినిమా నేషనల్ అవార్డుల బరిలో ఉండడం మా టీమ్‌కు ఎంతో సంతోషానిచ్చింది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో అవార్డులు అందుకుంది. ఈ మూవీ వలనే నాకు గుర్తింపు లభించింది. అయితే నాకు నేషనల్ వచ్చిందంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది వచ్చిన వాటిలో చాలా చిత్రాలు మా సినిమా కంటే అలరించాయి. ముఖ్యంగా ‘ది గోట్ లైఫ్’, ‘ఆవేశం’ లాంటి సినిమాల్లో స్టార్ల నటన అద్భుతం. వారి సరసన నేను ఉండటం నా అదృష్టం. జాతీయ అవార్డు వస్తుందా రాదా అనే విషయం గురించి చర్చించడానికి ఇది సమయం కాదు. నేషనల్ అవార్డులు ప్రకటించేవరకు వెయిట్ చేద్దాం అంటూ చెప్పుకోచ్చాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో మనోజ్ అనే IPS ఆస్పిరంట్(Aspirant)గా కనిపించాడు. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన విక్రాంత్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. ఇక UPSC కోసం ప్రయత్నించే లక్షలాది విద్యార్థుల నిజమైన కథల నుంచి ఈ చిత్రం రూపొందింది.
Also Read..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

