Jismat Mandi| ఉత్తమ డెబ్యూ గామా అవార్డు గ్రహీత సింధూరం, డ్రింకర్ సాయి ఫేం యాక్టర్, Jismat అధినేత ధర్మ మహేశ్ తన కొడుకు జగద్వాజ పుట్టిన రోజు సందర్భంగా అమీర్‌పేట్‌లో జిస్మత్(Jismat) జైల్ మండీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ధర్మ మహేష్ మాట్లాడుతూ.. ఇది మండీ ప్రియులకు వైవిధ్యమైన రుచులను అందిస్తోంది. మండీ అంటే జిస్మత్(Jismat) ఎపుడూ భోజన ప్రియులకు మొదటిస్థానంగా ఉండేలా మేము మెనూలో ఎప్పటికప్పుడు కొత్తదనం అందిస్తూ చికెన్, మటన్, చేపలు, పన్నీర్ శాఖాహారం, మాంసాహారంతో మంచి రుచితో అందుబాటులో ఉంచుతున్నాం అని వివరించారు. జిస్మత్(Jismat) తన కొడుకు జగద్వాజ పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ నుండి పుట్టింది. ఈ రీబ్రాండింగ్ Gismat నుంచి Jismat కు మార్చాం. ఇది నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ద్వారా ప్రేరణ పొందిన కొత్త దశను సూచిస్తుందని అన్నారు.
భావోద్వేగపరంగా ఈ పరివర్తన మరింత లోతుగా సాగుతుంది. ధర్మ మహేష్ కంపెనీ మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడు. ఆ పరివర్తన పూర్తయ్యే వరకు కార్యకలాపాలు, విస్తరణను పర్యవేక్షిస్తునాము. ఇక్కడ ప్రతి బిర్యానీ ప్లేట్, మా అతిథుల ప్రతి చిరునవ్వు, ఆహ్లాదాన్ని కలిగి ఉంటాయి. మేము అందించే రుచి, నాణ్యత, ఆప్యాయత ఈ కొత్త గుర్తింపు కింద మరింత బలంగా పెరుగుతాయి. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల పాటు బ్రాండ్‌ను బలోపేతం చేస్తుందని అని విశ్వసిస్తున్నామన్నారు.

AR Rahman | మతం పేరుతో చంపడం చాలా తప్పు.. ఇస్లాం మతంలోకి వెళ్లడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్