కోలీవుడ్ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం విక్రమ్ (Vikram). తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. మేకర్స్ ఇవాళ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అక్కడ అడవి ఉంటే సింహం, పులి, చిరుత వేటకు పోతే..జింక తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడితే..అంటూ కమల్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. విజయ్ సేతుపతి, ఫహద్, కమల్ హాసన్ మధ్య సాగే సీరియస్, యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ట్రైలర్ మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. విక్రమ్ ప్రాజెక్టు జూన్ 13 తెలుగు, తమిళంతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.