బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)-ఫర్హద్ సామ్జీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali). సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పొడుగుకాళ్ల సుందరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ (Tollywood)హీరో వెంకటేశ్ (Venkatesh) కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్‌తో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడని బీటౌన్ సర్కిల్ టాక్.
కాగా ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేశ్ పూజాహెగ్డే (Pooja Hegde)కు సోదరుడిగా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం వెంకీ చేస్తున్న తెలుగు సినిమా ఎఫ్ 3లో ఐటెం సాంగ్ చేస్తోంది పూజాహెగ్డే. ఇపుడు ఈ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్‌గా కనిపించబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించింది పూజాహెగ్డే. తెలుగులో ఆశించిన విజయాన్ని అందుకోని ఈ చిత్రం..తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన ఆచార్యలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా..ఈ సినిమా బాక్సాపీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిపోయింది.