టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టి (Athiya Shetty)తో పెళ్లి పీటలెక్కేందుకు (wedding) రెడీ అవుతున్నారని వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు డిసెంబర్లో పెళ్లి చేసుకోబోతున్నారని ఓ ముంబై మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. దీనిపై సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి (Ahan Shetty) స్పందిస్తూ..వెడ్డింగ్ లాంటిదేమి లేదని, పెళ్లిపై వస్తున్న కథనాలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ఇప్పటికే కొట్టిపారేశాడు.
అయితే తాజాగా సునీల్ శెట్టి (Suniel Shetty) ఈ వ్యవహారంపై స్పందించడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రీసెంట్ ‘ రాహుల్ అంటే ఇష్టమే. వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారనేది వాళ్ల నిర్ణయమే. ఎందుకంటే టైం మారుతుంటుంది. వారొక నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నా..నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి పెళ్లిపై కామెంట్స్ చేసి ఈ ఇద్దరు త్వరలోనే భార్యాభర్తలు కాబోతున్నారనేది నిజమే అని క్లారిటీ ఇచ్చేసినట్టేనా..? అని తెగ చర్చించుకుంటున్నారు సినీ,స్పోర్ట్స్ లవర్స్.
కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లక్నో సూపర్ జియాంట్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక అతియాశెట్టి 2019లో వచ్చిన మోతీ ఛూర్ చక్నాఛూర్ సినిమా తర్వాత మరే ప్రాజెక్టును ఓకే చేయలేదు. సునీల్ కామెంట్స్ నేపథ్యంలో రాహుల్, అతియా ఏమైనా స్పందిస్తారేమోనని ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ జనాలు.