Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
అలనాటి అందాల తార లయ (Laya) సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీరుస్తుంది లయ. ఎప్పటికపుడు ట్రెండీ పాటలతో నెట్టింట సందడి చేస్తుంటుంది.
స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అలనాటి అందాల తార లయ (Laya). ఈ బ్యూటీ ప్రస్తుతం కాలిఫోర్నియాలో తన ఫ్యామిలీతో కలిసి సెటిలైంది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆ లోటును తీరుస్తుంది లయ. ఎప్పటికపుడు ట్రెండీ పాటలతో నెట్టింట సందడి చేస్తుంటుంది.
తాజాగా సర్కారు వారి పాట నుంచి Every Penny songకు స్టైలిష్ స్టెప్పులేసి (Laya dancing video) అదరహో అనిపించింది. గతంలో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లయ..ఈ సారి కూతురితో కలిసి డ్యాన్స్ చేసింది. కర్లీ హెయిర్‌లో ఉన్న లయ, శ్లోక (Sloka) బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో స్లైలిష్ గా స్టెప్పులేసి..సితారను బీట్ చేశారు. తళ్లీకూతుళ్లు పెన్నీ పాటను రీక్రియేట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇద్దరిలో ఎవరు లయ, ఎవరు శ్లోక అని గుర్తు పట్టలేనంతగా పాటలో లీనమైపోయి డ్యాన్స్ చేశారు. లయ, శ్లోక డ్యాన్సింగ్ స్కిల్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ..కామెంట్లు పెట్టారు. దీంతోపాటు రామ్-కృతిశెట్టి కాంబోలో వచ్చిన బుల్లెట్ సాంగ్‌కు కాలిఫోర్నియా వీధుల్లో ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో కూడా నెట్టింట్లో హల్ చల్ చస్తోంది.
Read Also : Sunil | సొంతం సినిమా చాలా సార్లు చూశాడట..ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చాడు : సునీల్
Read Also : Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
Read Also : BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

