లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం విక్రమ్ (Vikram). ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో చూపించాడు కమల్ హాసన్. తొలి రోజు నుంచి ఏదో ఒక ఫీట్‌ను చేరుకుంటూ వార్తల్లో నిలిచింది విక్రమ్. హోంబ్యానర్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా 75 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ విషయాన్ని రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. భారతీయ సినిమా..#75DaysofVikram హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ..కౌంటింగ్ అని ట్వీట్ చేసింది. సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విక్రమ్ ఈ అరుదైన మార్కును చేరుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం విక్రమ్ మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.400 కోట్ల మార్కును దాటినట్టు అంచనా.
విక్రమ్ ఒక్క తమిళనాడులోనే 17 రోజుల్లో రూ.155 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. జులై 8న డిస్నీ+హాట్‌స్టార్‌లో ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైంది విక్రమ్. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతలి కీలక పాత్రలు పోషించారు.
Read Also :Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్‌కు చిరు రెడీ..!
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!