Donald Trump : భారత్, బ్రెజిల్ (India, Brezil) దేశాల మధ్య తేడాను గుర్తించడంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తడబడ్డారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల (Brezil Presidential Elections) ను భారత అధ్యక్ష ఎన్నికలుగా తడబడుతూ ఆయన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ (Truth Social) లో ఒక పోస్టు పెట్టారు. బ్రెజిల్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల గురించి పేర్కొంటూ ఆ దేశాన్ని పొరపాటున భారత్‌గా ప్రస్తావించారు.
బ్రెజిల్లో తొలిదశ పోలింగ్ ముగిసిన వెంటనే ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. ట్రంప్ తడబడుతూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకూ ట్రంప్ ఏమని పోస్టు చేశారంటే.. ‘భారత అధ్యక్ష ఎన్నికల తొలి దశలో 125 మిలియన్ల మంది ఓటువేశారు. ఓటింగ్ ముగిసిన వెంటనే అదేరోజు ఫలితాలు వచ్చేశాయి. కానీ అమెరికాలోని డెట్రాయిట్, ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియా వంటి నగరాల్లో ఇంతకంటే తక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్నా, ఫలితాలు లెక్కించడానికి వారాలు పడుతుంది. అమెరికాలో ఓటింగ్ వ్యవస్థ అవినీతిమయం’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే భారత్‌లో ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరనే విషయాన్ని ఆయన గమనించలేదు. అధికారిక వైట్ హౌస్ రాపిడ్ రెస్పాన్స్ ఖాతాదారు కూడా ఈ విషయాన్ని గమనించకుండా ట్రంప్ పోస్టును రీపోస్ట్ చేయడం గమనార్హం. ట్రంప్ పోస్ట్ చేసిన వెంటనే వేలాదిమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల విభాగంలో ఆయన పొరపాటును సరిదిద్దారు. ఎన్నికలు జరిగింది భారత్‌లో కాదని, బ్రెజిల్లో అని స్పష్టంచేశారు.