Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!
కల్యాణ్ రామ్‌కు పటాస్ తర్వాత బింబిసార రూపంలో మళ్లీ మంచి హిట్టనందించాడు వశిష్ఠ (Vassishta). ఇటీవలే బాబాయి నందమూరి బాలకృష్ణ (Balakrishna)కు స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేయించాడు కల్యాణ్ రామ్. డైరెక్టర్ వశిష్ఠ, బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
బింబిసార (Bimbisara) సినిమాతో ఫస్ట్ ఎంట్రీలోనే అదరగొట్టేశాడు యువ దర్శకుడు వశిష్ఠ (Vassishta). కల్యాణ్ రామ్‌కు పటాస్ తర్వాత బింబిసార రూపంలో మళ్లీ మంచి హిట్టనందించాడు. తొలి రోజు నుంచి బింబిసార బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇటీవలే బాబాయి నందమూరి బాలకృష్ణ (Balakrishna)కు స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేయించాడు కల్యాణ్ రామ్. డైరెక్టర్ వశిష్ఠ, బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే చాలా వినయపూర్వకంగా బాలకృష్ణ పక్కనే నిల్చున్న వశిష్ఠ గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏంటనుకుంటున్నారా..? అదేనండి అబ్బాయికి మంచి హిట్టు ఇచ్చిన వశిష్ఠ..అతని బాబాయి బాలకృష్ణతో కూడా సినిమా చేయబోతున్నాడట. స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత బాలకృష్ణ స్పీచ్‌తో చిన్న వీడియో క్లిప్పింగ్ రిలీజ్ చేశారు. కల్యాణ్ రామ్‌తోపాటు వశిష్ఠను ప్రశంసించాడు బాలయ్య.
అంతేకాదు తాను వశిష్ఠతో సినిమా చేయాలనుకుంటున్నానని బాలకృష్ణ చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మాటలు రానున్న రోజుల్లో బాలకృష్ణ-వశిష్ఠ కాంబినేషన్లో సినిమా ఉంటుందని కన్ఫామ్ చేస్తున్నా..ఆ సినిమా ఎప్పుడు వస్తుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

