Abhishek Bachchan – Neeraj Chopra | పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బల్లెం వీరుడు నీరజ్ చోప్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. స్టేట్ డి ఫ్రాన్స్ వేదికగా గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన నీరజ్.. తుదిపోరులో అంచనాలను ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయాడు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఒలింపిక్స్‌లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 92.97 మీటర్ల రికార్డు త్రో తో పసిడి సొంతం చేసుకున్నాడు.
అయితే సిల్వర్ గెలుచుకున్న అనంతరం బాధతో ఉన్న నీరజ్‌ను బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. ఈ ఫైనల్‌కు అభిషేక్ బచ్చన్ హాజరైన విషయం తెలిసిందే. నీరజ్ ఫస్ట్ రౌండ్ నుంచి అతడిని దగ్గరుండి ఎంకరేజ్ చేశాడు అభిషేక్. ఇక నీరజ్‌ను అభిషేక్ హగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nice gesture by Abhishek Bachchan and you make the nation proud. Well done!
Congratulations @Neeraj_chopra1 on winning the Silver 🥈 medal for India. 🇮🇳#NeerajChopra #JavelinThrow#OlympicGames #Paris2024 pic.twitter.com/YdPO9wc1yg— Sanjana Ganesan 🇮🇳 (@iSanjanaGanesan) August 9, 2024
Also Read..