Ayyana Patrudu | జగన్ ఉత్త ఎమ్మెల్యే మాత్రమే.. ముఖ్యమంత్రి కాదని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు కాబట్టి అసెంబ్లీకి రావాలని సలహా ఇచ్చారు. అన్ని పార్టీలకు ఇచ్చినట్లే తనకూ అవకాశం ఇస్తానని తెలిపారు. అంతేతప్ప ఎమ్మెల్యేగా గెలిచి సభకు రాను అనడం పద్ధతి కాదని స్పష్టం చేశారు.
జగన్‌ను ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఎన్నుకుంటే మా ప్రాంతం బాగుపడుతుందని అనుకుని ప్రజలు ఎన్నుకున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు. అది పక్కనబెట్టి నేను అసెంబ్లీకి రానని జగన్ అంటున్నాడని.. అసెంబ్లీకి రానడం పద్ధతి కాదని హితవుపలికారు. పగలు ఉంటాయి.. పోతాయి.. ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడాలని సలహా ఇచ్చారు. స్పీకర్‌గా తాను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనని ఎందుకు ఊహించుకుంటున్నారని ప్రశ్నించారు. అన్ని పార్టీల వాళ్లకు ఇచ్చినట్లే వాళ్లకూ అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు.
అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినట్లే వైసీపీకి అవకాశం ఇస్తానని.. కాకపోతే కొన్ని కండీషన్లు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు చెప్పారు. సభలో మెంబర్స్‌ను బట్టి క్వశ్చన్స్ వేయొచ్చని చెప్పారు. సభలో తెలుగు దేశం పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్లు ఎక్కువ క్వశ్చన్స్ వేయొచ్చని చెప్పారు. ఆ తర్వాత జనసేన పార్టీకి ఎక్కువ క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత కోటా బీజేపీకి ఉంటుందని.. దాని తర్వాత కోటా వైసీపీకి వస్తుందని వివరించారు. అంతేకానీ తనకే అన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇవ్వాలంటే కుదరదని అన్నారు. దానికి కొన్ని రూల్స్, పద్ధతులు ఉంటాయని తెలిపారు. అవన్నీ తెలుసుకుని జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు.
ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావాలని జగన్‌కు అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలని సూచించారు. పద్ధతి ప్రకారం ఎంత టైమ్ ఇవ్వాలో అంత టైమ్ ఇస్తానని తెలిపారు. అంతేతప్ప సభకు రానంటే ప్రజలు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.