Health tips | రోజూ ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Health tips | రోజూ ఖాళీ కడుపుతో కాఫీ తాగేవాళ్లు భవిష్యత్తులో అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు వెల్లడించిన ప్రకారం ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Health tips : చాలా మందికి ఉదయం లేవగానే వేడివేడిగా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. పొరపాటున ఒక్కరోజు ఏదైనా కారణంవల్ల కాఫీ తాగలేక పోయారంటే ఏదో కోల్పోయామన్న భావనలో ఉంటారు. కానీ ఉదయాన్నే కాఫీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖాళీ కడుపుతో కాఫీ తాగేవాళ్లు భవిష్యత్తులో అనేక ఆరోగ్యపరమైన దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నిపుణులు వెల్లడించిన ప్రకారం ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దుష్ర్పభావాలు
ఉదయం లేవగానే కాఫీ తాగడంవల్ల కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ పెరుగుతుంది. అదేవిధంగా కార్టిసాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఆందోళన, భయం పెరుగుతాయి. అంతేగాక రోజూ ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. విశ్రాంతిని, ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది..
కాఫీలో టానిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఐరన్, కాల్షియం సహా కొన్ని పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల శరీరం త్వరగా రోగాలబారిన పడుతుంది. కెఫీన్, యాసిడ్ స్థాయిల కలయిక కడుపుని చికాకు పెడుతుంది. దాంతో కడుపులో నొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్‌కు కారణమవుతుంది.
అలాగే ఖాళీ కడుపుతో కాఫీని తీసుకుంటే అందులోని కెఫిన్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏదైనా తిన్న తర్వాత కాఫీని తాగితే మాత్రం పెద్దగా ప్రమాదమేమీ ఉండదని పేర్కొన్నారు. ఖాళీ కడుపుతో తాగినప్పుడు మాత్రమే కాఫీ ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

