ఎల్బీనగర్, ఆగస్టు 09 : దిల్సుఖ్నగర్లోని శ్రీ షిర్డిసాయిబాబా సంస్తాన్ ట్రస్టు(Saibaba Sansthan Trust) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగ జంటకు(Disabled couple) ఉచితంగా వివాహం జరిపించారు. నగరంలోని గౌలిపుర శాంతి దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీగిరి రజిని అభ్యర్తన మేరకు దివ్యాంగుల జంట రాముడు, మంజులకు సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.
సాయిబాబా సంస్థాన్ ట్రస్టు మాజీ ఛైర్మన్ గుండ మల్లయ్య దివ్యాంగ జంట వివాహనికి స్వంతంగా పట్టు వస్త్రాలు, బంగారు మంగళ సూత్రాలను అందజేశారు. వివాహం అనంతరం ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ ట్రస్టు చైర్మన్ బీవీ శ్యాంకుమార్, కోశాధికారి వూర నర్సింహ గుప్త, జాయింట్ సెక్రటరీ కొడి రాజశేఖర్, కార్యవర్గ సభ్యుడు శ్యామలరావు తదితరులు పాల్గొని దివ్యాంగ జంటను ఆశీర్వదించారు.