బాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరు అమీర్‌ఖాన్ (Aamir Khan). ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల జాబితాలో మొదటి స్థానంలో ఉంటాడు ఈ స్టార్ హీరో. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఎంతో కష్టపడి చేసినా ఈ సినిమా మాత్రం అమీర్‌ఖాన్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. నిర్మాతలకు కోట్లలో నష్టాలను తెచ్చిపెట్టింది.
ఈ సినిమా ఫెయిల్యూర్ అమీర్ ఖాన్ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో అర్థమవుతోంది. నేను చాంపియన్స్ అనే సినిమా చేయాల్సి ఉంది. అయితే నేను ఆ సినిమాలో నటించడం లేదు. కేవలం నిర్మాణ బాధ్యతలను మాత్రమే చూసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.
తాను రెండేళ్ల విరామం తీసుకుని కుటుంబంతో ఉండాలని నిర్ణయించుకున్నానని, ముఖ్యంగా అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన తన తల్లి పక్కనే ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. ఇన్నాళ్లూ తన పిల్లలకు సరైన సమయం కేటాయించ లేకపోయాయని, ఇపుడు ప్రశాంతమైన క్షణాలను గడిపే సమయం వచ్చిందన్నారు.
Read Also : Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్