Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్
Superstar krishna | సూపర్ స్టార్ కృష్ణ 1965లో తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇంతకు మందు పలు చిత్రాల్లో నటించిన చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం
Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ 1965లో తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఇంతకు మందు పలు చిత్రాల్లో నటించిన చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తేనె మనసులు. ఈ చిత్రంలో హీరోగా కృష్ణకు ఆయన అవకాశం కల్పించారు. సూపర్‌స్టార్ 1966లో వచ్చిన గూఢచారి 116తో తొలిసారి స్పై జోనర్ తరహా చిత్రాలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు కృష్ణ. ఆ తర్వాత 1967లో హీరోగా నటించిన సాక్షి చిత్రం తాష్కెంట్ ఫిలిమ్ ఫెస్టివల్లో స్ట్రీమింగ్ అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1972లో నటించిన పండంటి కాపురం ఉత్తమ ఫీచర్ ఫిలిమ్ (తెలుగు) నేషనల్ అవార్డు అందుకుంది. మైథలాజికల్, డ్రామా, వెస్టర్న్, ఫాంటసీ, యాక్షన్, స్పై జోనర్‌తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
కృష్ణ నటించిన స్పై జోనర్ సినిమాలు ఇవే..
గూడఛారి 116, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపీ, రహస్య గూడఛారి, గూడఛారి 117.
కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలు..
17 ఫీచర్ ఫిలిమ్స్‌తోపాటు శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలన్నింటిలో కుమారుడు మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ బ్యానర్లో తన సోదరులు ఆదిశేషగిరి రావు, హన్మంతరావు కలిసి ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో తెలుగు యాక్టర్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా అరుదైన రికార్డు కూడా కృష్ణ ఖాతాలో ఉన్నది. కెరీర్లో ఆదుర్తి సుబ్బారావు, వీ మధుసూదన రావు, కే విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణ రావు, కే రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

